అనకాపల్లి,(ప్రజాముద్ర)విద్యార్థులు జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసిపి నేతలు ఆందోళన చేపట్టారు. పెద్ద ఎత్తున వైసిపి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. అధ్యక్షులు బూడి ముత్యాలనాయుడు, అనకాపల్లి నియోజకవర్గ వైస్సార్సీపీ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్, మాజీ పార్లమెంట్ సభ్యురాలు బీశెట్టి సత్యవతి, మాజీ యలమంచిలి శాసనసభ్యులు ఉప్పలపాటి వెంకటరమణ మూర్తి రాజు మాజీ చోడవరం శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ మాజీ పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజు, మాజీ నర్సీపట్నం శాసనసభ్యులు పెట్ల ఉమా శంకర్ గణేష్, మాజీ శాసనసభ్యులు కంబాల జోగులు .మాడుగుల నియోజకవర్గ సమన్వయకర్త ఈర్ల అనురాధ, మాజీ గవర కార్పొరేషన్ చైర్మన్ బొడ్డేడ ప్రసాద్, మాజీ పార్లమెంట్ పరీశీలకులు శరగడం చిన్న అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసం చేసిందన్నారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి నేడు ఒక్క హామీ ను కూడా నెరవేర్చలేదన్నారు. జగన్ సీఎం గా ఉన్న సమయంలో నాడు నేడు ద్వారా పాఠశాల భవనాలు అధునాతన సదుపాయాలు కల్పించడంతో పాటు విద్యా వ్యవస్థను సమూల మార్పులు చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు బైజూస్, ట్యాబ్ లు అందించారు. డాక్టర్ కావాలన్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేవారు. నేడు కూటమి అంతకంటే ఎక్కువ చేస్తామని చెప్పిందన్నారు.. నేటి వరకు బడ్జెట్లో యువతకు కేటాయించింది ఏమీ లేదన్నారు. విద్యార్థులు చదువులు మానుకునే పరిస్థితి నెలకొందన్నారు. జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో నేడు అనకాపల్లి కలెక్టరేట్ వద్ద ఆందోళన చేసి కలెక్టర్కి వినతిపత్రం అందజేశారు. యువతకు ఉద్యోగం వచ్చేవరకు 3 వేలు నిరుద్యోగ భృతి కల్పిస్తామని అన్నారు… నేటికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదనీ ఆరోపించారు.









