ఈనెల 30న నిర్వహించే పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు

ప్రశాంత వాతావరణం లో పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష నిర్వహించాలి

జిల్లాలో 23 పరీక్ష కేంద్రాల్లో హాజరు కానున్న 9,022 మంది విద్యార్డులు *జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్*

అనకాపల్లి, ఏప్రిల్ 23: జిల్లాలో ఈనెల 30వ తేదీ బుధవారం జరిగే పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ విజయ క్రిష్ణన్ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ ఛాంబర్ లో పాలిటెక్నిక్ ప్రవేశ నిర్వహణ ఏర్పాట్లపై ప్రవేశ పరీక్ష సమన్వయ కమిటీతో కలెక్టర్ సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 30 వ తేదీ బుధవారం జరగనున్న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష కోసం 9,022 మంది విద్యార్ధులు హాజరు కానున్నారని, విరి కోసం జిల్లాలో 23 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ పరీక్ష ఉదయం 11 గంటల నుండి మధ్యాన్నం 1 గంట వరకు జరుగుతుందని కావున విద్యార్థులు పరీక్ష కేంద్రని కి ఉదయం 9 గంటలకే చేరుకోవాలన్నారు. ఈ పరీక్షను కట్టుదిట్టంగా నిర్వహించాలని తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్ ను, డిపార్ట్మెంటల్ అధికారిని నియమించాలని,
నర్సీపట్నం, అనకపల్లి లో 2 ఫ్లయింగ్ స్కాడ్ బృందలను ఏర్పాటు చేయాలనీ సూచించారు. అన్ని పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, జెరాక్ష్ షాప్ లు , నెట్ సెంటర్లను మూసి వేయాలని తెలిపారు. ప్రశ్నా పత్రాలను నిల్వ ఉంచుటకు గానూ అనకాపల్లి, నర్సీపట్నం పోలీస్ స్టేషన్లలో సేఫ్ కస్టడీ ఏర్పాట్లను చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని విద్యుత్ అధికారులకు, తాగు నీరు, పారిశుధ్యం ఏర్పాటు చేయాలనీ మునిసిపల్ అధికారులను ఆదేశించారు. విద్యార్ధులకు ఇబ్బంది కలగకుండా పరీక్షల సమయంలో అవసరమగు బస్సులను నడపాలని ఆర్.టి.సి వారికీ తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపు లను నిర్వహించి అత్యవసర మందులను సిద్ధంగా ఉంచాలని డి.ఎం.హెచ్.ఓ కు సూచించారు. ఈ పరీక్షను సమర్దవంతముగా ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష సమన్వయ అధికారి ఐ శ్రీనివాసరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎమ్ శాంతి ప్రభ, కలెక్టర్ కార్యాలయం సమన్వయ అధికారి ఎస్ వాసు నాయుడు, కమిటీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు