అనకాపల్లి:జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం వద్ద పర్యాటకులపై సాయుధ ముష్కరుల దాడిని ఖండిస్తూ అనకాపల్లి పరమేశ్వరి పార్కు వద్ద శనివారం ఉదయం వాకర్స్ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉగ్ర మూకలు అతి కిరాతకంగా హిందువులని కాల్చి చంపడం దారుణమని అన్నారు. ఉగ్ర దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ జగన్మోహన్రావు శరగడం నూకరాజు, బొడ్డేడ శంకర్రావు, మెల్లేటి నర్సింగరావు, శివాజీ, ఆడారి నూక అప్పారావు , ఆళ్ల మహాలక్ష్మి నాయుడు ఎండోమెంట్ శంకర్రావు,పెదకం శెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 77








