ది హైదరాబాద్:
రేవంత్ సీఎం కుర్చీలో ఆయన కూర్చున్నా.. బజారు భాష పోవడం లేదని ఖైరతాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇన్ ఛార్జి మన్నెగోవర్ధన్ రెడ్డి దుయ్యబట్టారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ యాదగిరిగుట్ట సాక్షిగా ఆలేరు సభ లో పాపాలు, శిక్ష అంటూ రేవంత్ నిస్సిగ్గుగా తప్పుడు మాటలు మాట్లాడారని, దెయ్యాలు అంటూ సీఎం స్థాయి మరిచి వ్యాఖ్యలు చేస్తున్నాడన్నారు. అధికారం చేపట్టి 18 నెలలైనా మాజీ సీఎం కేసీఆర్పై ఇంకా ఏడుపెందుకు? 70 ఏండ్ల వయసులో ఉన్న పెద్దమనిషి కాలుజారి గాయపడితే దూషించడం, దేవుడు శిక్షించాడనడం దుర్మార్గమని, ఇదే నా నీ సంస్కారం అంటూ ఫైరయ్యారు. కేసీఆర్ కుటుంబం మీద ఏడవడం తప్ప ఏడాదిన్నరలో చేసిందేమీలేదన్నారు
Post Views: 125








