సింగయ్య మృతి కేసు… క్వాష్ పిటిషన్ వేసిన జగన్..

వైసీపీ అధినేత జగన్ ఇటీవలి పల్నాడు జిల్లా సత్తెనపల్లి పర్యటన సందర్భంగా విషాదకర ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. మొత్తం ముగ్గరు వ్యక్తులు ఈ పర్యటన సందర్భంగా చనిపోయారు. జగన్ వాహనం చక్రాల కింద్ర పడి సింగయ్య అనే వ్యక్తి దుర్మరణం చెందారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనకు సంబంధించి జగన్ తో పాటు, కారు డ్రైవర్, పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదయింది. ఈ కేసులో జగన్ ఏ2గా ఉన్నారు. ఇప్పటికే కారు డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారును కూడా సీజ్ చేశారు.

 

ఈ నేపథ్యంలో జగన్ తో పాటు కేసులోని ఇతర నిందితులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు…  విచారణ జరుపుతామని తెలిపింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు