కాంగ్రెస్ పాలనలో ఎరువులకూ కరవు: కేటీఆర్ ఫైర్..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులకు కష్టాలు తప్పడం లేదని, రైతు భరోసా, రుణమాఫీ హామీలతో పాటు ఇప్పుడు ఎరువులకు కూడా తీవ్రమైన కరవు ఏర్పడిందని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఆరోపించారు. వ్యవసాయం కోసం అప్పులు తెచ్చినా, కనీసం ఒక ఎరువుల బస్తా కూడా అందించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఆయన తీవ్రంగా విమర్శించారు.

 

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.94 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల లోటు ఎందుకు ఏర్పడిందో ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మార్కెట్‌లో కేవలం రూ. 266కు దొరకాల్సిన యూరియా బస్తా ధర ఇప్పుడు రూ. 325కి పెరిగిందని, ఈ ధరల పెరుగుదలకు ఎవరు బాధ్యత వహించాలని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.

 

కొంతమంది కావాలనే కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. దీని వెనుక ఎవరున్నారో తేల్చేందుకు తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న ఈ వ్యవహారంపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని కేటీఆర్ అన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు