మాటలకే సీఎం రేవంత్ ప్రభుత్వం.. బీఆర్ఎస్ నేత మన్నె గోవర్ధన్ రెడ్డి ఫైర్..

  • హైడ్రా అంటే కూల్చివేతలే
  • అధికారులు కూడా రాజకీయ ప్రకటనలు చేయడం దారుణం
  • ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత మన్నె గోవర్ధన్ రెడ్డి ఫైర్

 

ది హైదరాబాద్ మీడియా : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటినా ఇందిరమ్మ ఇండ్లపై ఎలాంటి పురోగతి లేదని బీఆర్ఎస్ నేత మన్నె గోవర్ధన్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాటలకే పరిమితమవుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎన్నో వాగ్దానాలు చేసిందని, ఇందిరమ్మ ఇండ్లపై కూడా వాగ్దానం చేసినా ఆచరణలో అమలు కావడం లేదన్నారు. ఆదివారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కట్టిన ఇండ్లే ఇప్పుడు ఇస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కూడా కేసీఆర్ హయంలో కట్టినవే ఇస్తున్నామని చెప్పారని గుర్తు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఉపన్యాసాలే ఇస్తున్నారని, పనులు చేయడం లేదని అన్నారు. హైదరాబాద్ లో ఇందిరమ్మ ఇండ్లకు స్థలాలు ఇప్పటికీ ఎంపిక చేయలేదని.. ఇండ్లు ఎప్పుడు కడతారని ప్రశ్నించారు?. కేసీఆర్ హయంలో 2 లక్షలకు పైగా డబుల్ బెడ్ రూమ్ లు కట్టించారని తెలిపారు.

 

హైడ్రా కూల్చివేతలకు తప్ప..

రేషన్ కార్డుల విషయంలో కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల కోసమే రేషన్ కార్డుల పంపిణీ హడావిడి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అధికారులు కూడా రాజకీయ ప్రకటనలు చేయడం దారుణమన్నారు. కేసీఆర్ హయంలో ఆరు లక్షల 47 వేల రేషన్ కార్డులు ఇచ్చామని చెప్పారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ కు ప్రజలు కర్రు కాల్చి పెట్టడానికి సిద్ధమయ్యారని విమర్శించారు. హైదరాబాద్ లో వర్షాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రిగా విఫలం అయ్యారని, సీఎం సమీక్షలు చేసినా ఫలితాలు రావడం లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి అంతటి అసమర్థ సీఎం మరొకరు లేరని ఎద్దేవా చేశారు. హైడ్రా కూల్చివేతలకు తప్ప దేనికి పనికి రావడం లేదని అన్నారు. రేవంత్ రెడ్డి.. సీఎం, విద్యా శాఖ మంత్రిగా ,మున్సిపల్ మంత్రిగా ,హోం మంత్రిగా ఫెయిల్ అయ్యారని దుయ్యబట్టారు. సీఎం రేవంత్ కు చేత కాకపోతే దిగిపోవాలని కామెంట్స్ చేశారు. రేవంత్ ప్రజా పాలన కాదు..ప్రజా భక్షక పాలన అని విమర్శించారు.సీఎం మాటలు మాని ఇప్పటికైనా చేతుల మీద దృష్టి పెట్టాలన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు