ప్రజా పాలన కాదు.. ప్రజా భక్షక పాలన..! కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత మన్నె గోవర్ధన్ రెడ్డి ఫైర్..!

ది హైదరాబాద్ మీడియా : కాంగ్రెస్ సర్కార్ పై బీఆర్ఎస్ రాష్ట్రనాయకులు, ఖైరతాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ ఛార్జి మన్నె గోవర్ధన్ రెడ్డి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటినా ఇందిరమ్మ ఇండ్లపై ఎలాంటి పురోగతి లేదని బీఆర్ఎస్ నేత మన్నె గోవర్ధన్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాటలకే పరిమితమవుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఎన్నో వాగ్దానాలు చేసిందని, ఇందిరమ్మ ఇండ్లపై కూడా వాగ్దానం చేసినా ఆచరణలో అమలు కావడం లేదన్నారు. ఆదివారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కట్టిన ఇండ్లే ఇప్పుడు ఇస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కూడా కేసీఆర్ హయంలో కట్టినవే ఇస్తున్నామని చెప్పారని గుర్తు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఉపన్యాసాలే ఇస్తున్నారని, పనులు చేయడం లేదని అన్నారు. హైదరాబాద్ లో ఇందిరమ్మ ఇండ్లకు స్థలాలు ఇప్పటికీ ఎంపిక చేయలేదని.. ఇండ్లు ఎప్పుడు కడతారని ప్రశ్నించారు?. కేసీఆర్ హయంలో 2 లక్షలకు పైగా డబుల్ బెడ్ రూమ్ లు కట్టించారని తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు