హైదరాబాద్ సిటీ,
కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన, అపర భగీరథుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా ఖైరతాబాద్ నియోజకవర్గంలోని తెలంగాణ భవన్ వద్ద నియోజకవర్గ ఇంచార్జ్ మన్నె గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం. చేశారు.
కేసీఆర్ నిర్మించిన తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను నిరసిస్తూ.. “ఘోష్ కమిషన్ – దొంగ కమిషన్” అంటూ, ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్తున్న రేవంత్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు.
“సీఎం డౌన్ డౌన్ – కాంగ్రెస్ ప్రభుత్వం డౌన్” అంటూ నినాదాలు చేస్తూ పెద్దఎత్తున ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మన్నె గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరంప్రాజెక్టును మూసేసేందుకు, ఏపీ లబ్ది చేర్చేందుకు సీఎం రేవంత్ కుట్రలకు తెరలేపాడన్నారు. కేసీఆర్ మచ్చలేని మహానాయకుడన్నారు.








