ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్దంగా సాగునీటి సంఘాల ఎన్నికలు
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్న ప్రభుత్వం
సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అరాచకం
వైయస్ఆర్ సిపి ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకుంటున్నారు
పలుచోట్ల కూటమి పార్టీలకు చెందిన వారు దాడులకు కూడా తెగబడుతున్నారు
అభ్యర్ధులకు ఎన్వోసీలు ఇవ్వడం లేదు
పోలీసుల జోక్యంతో వైయస్ఆర్ సిపి నేతలపై బెదిరింపులు
సాగునీటి సంఘాల
ఎన్నికలపై టెలి కాన్ఫరెన్స్
ప్రభుత్వం మాజీ విప్ ధర్మశ్రీ
చోడవరం డిసెంబర్ 14
రాష్ట్రంలో సాగునీటి సంఘాలకు జరుగుతున్న ఎన్నికలను అప్రజాస్వామికంగా నిర్వహిస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా, ఈ ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. పార్టీ అధినేత వైయస్ జగన్ ఆదేశాల మేరకు ఎన్నికలు బహిష్కరించినట్టు మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ మాజీ కరణం ధర్మశ్రీ చెప్పారు. శనివారం ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వ తీరు దారుణంగా ఉందన్నారు.సాగునీటి సంఘాల ఎన్నికల్లో ఆయా జిల్లాల్లో ప్రభుత్వ సూచనలతో అధికార యంత్రాంగం వ్యవహరించిన తీరును టెలి కాన్ఫరెన్స్లో సమీక్షించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లాల నేతల నుంచి వచ్చిన స్పందన, వారి అభిప్రాయాలను పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లారన్నారు.అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, ఈ సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న అత్యంత దారుణ వైఖరికి నిరసనగా,ఎన్నికలు బహిష్కరించాలని నిర్ణయించారన్నారు.
కాన్ఫరెన్స్లో నేతలు ఏం చెప్పారంటే..:సాగునీటి సంఘాల ఎన్నికల్లో వైయస్సార్సీపీ పోటీ చేస్తున్న చోట్ల రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాన్ని ప్రయోగించి, కూటమి ప్రభుత్వం దారుణంగా అధికార దుర్వినియోగంకు పాల్పడుతోందనీ,ఎన్నికల నిబంధనల ప్రకారం సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరగాల్సి ఉందనీ,అలాగే అడిగిన చోట్ల సీక్రెట్ బ్యాలెట్ ప్రకారం ఎన్నికలు జరపాల్సి ఉంటుందన్నారు.ఆ బాధ్యత ప్రభుత్వ యంత్రాగానిదే
కానీ దానికి పూర్తి భిన్నంగా కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారుల ఏకపక్షంగా నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారన్నారు.ఈ ఎన్నికల్లో పాల్గొనాలని నిర్ణయించిన వైయస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దౌర్జన్యాలకు దిగుతున్నారనీ,పోలీసులను ప్రయోగించి తప్పుడు కేసులు పెడతామని బెదిరిస్తున్నారన్నారు.
జిల్లాల్లో రెవెన్యూ అధికారులు ఎన్ఓసీలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారనీ, దాన్ని ప్రశ్నించిన పార్టీ నాయకులను,ప్రజా ప్రతినిధులను హౌస్ అరెస్ట్లు చేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.కూటమి పార్టీలకు చెందిన వారు, తమకు గెలిచే అవకాశం లేకపోయినా,దౌర్జన్యంతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎలాగైనా సరే గెలవాలనే ఉద్దేశంతో రౌడీయిజానికి కూడా దిగుతున్నారన్నారు. వాటిని వెలుగులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నించిన మీడియాపైనా దాడులకు దిగడం ద్వారా కూటమి ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలకు తెగబడుతోందన్నారు.
అందుకే ఎన్నికల్లో పోటీ చేయొద్దని,కూటమి ప్రభుత్వ దాష్టికానికి నిరసగా ఈ ఎన్నికలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉండాలని నేతలు అభిప్రాయపడ్డారన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతల నుంచి వచ్చిన స్పందనను పార్టీ అధినేత వైయస్ జగన్కు నివేదించిన నేపథ్యంలో సాగునీటి ఎన్నికలను బహిష్కరించడం ద్వారా కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక, నిరంకుశ విధానాలను ప్రజల్లో ఎండగట్టాలని పార్టీ అధినేత వైయస్ జగన్ నిర్ణయించినట్లు ధర్మ శ్రీ తెలిపారు.








