అనకాపల్లి, జనవరి 27: ఈవీఎం గోదామును జిల్లా రెవెన్యూ అధికారి వై సత్యనారాయణ రావు తనిఖీ చేశారు. నెలవారీ తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్.పి. కార్యాలయం ఆవరణలో గల ఈవీఎం గోడౌన్ ను సోమవారం మధ్యాహ్నం జిల్లా రెవిన్యూ అధికారి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో తనిఖీ చేసి అక్కడ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరును, ప్రధాన ద్వారానికి ఉన్న సీళ్లను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఎలక్షన్ సెక్షను సూపరింటెండెంటు వాసు, ఉప తహసీల్దార్ రవి కుమార్, అనకాపల్లి ఎలక్షన్ ఉప తహసీల్దార్లు వి.రాజ్యలక్ష్మి, అనకాపల్లి స్టేషన్ ఫైర్ ఆఫీసర్, పి నాగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ ప్రతినిధి బి.శ్రీనివాసరావు, బిజెపి ప్రతినిధి పి.నాగేశ్వరరావు, వైసీపీ ప్రతినిధి టి.షణ్ముఖ, ఐఎన్ సి ప్రతినిధి టి రమణ, ఆప్ పార్టీ ప్రతినిధి కె.హరినాధబాబు తదితరులు పాల్గొన్నారు.

Post Views: 141








