అనకాపల్లి,(ప్రజాముద్ర) :- వైసీపీ అధినేత వైఎస్
జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు ఈనెల 12న నిర్వహించే వైసిపి యువత పోరు ఆందోళన కార్యక్రమాన్ని పార్టీ శ్రేణులు విజయ వంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, పార్టీ అనకాపల్లి నియోజకవర్గం సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక రింగ్ రోడ్ లో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడు మందపాటి జానకిరామరాజు అధ్యక్షతన విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా యువత పోరు పోస్టర్లను బూడి ముత్యాల నాయుడు, మలసాల భరత్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముత్యాల నాయుడు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ ఇంచార్జ్ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఎగురవేసి ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించాలని కోరారు. స్థానిక రింగ్ రోడ్లో ఉన్న వైసీపీ కార్యాలయంలో ఉదయం 10 గంటలకు జెండా ఎగురవేసి ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నమని చెప్పారు. అనంతరం పార్టీ శ్రేణులు భారీ ఎత్తున ర్యాలీగా కలెక్టరేట్కు తరలివెళ్లి కూటమి ప్రభుత్వ వైఫల్యాల పై కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు కళాశాలలకు వెళ్ళలేక గందరగోళ పరిస్థితుల్లో ఉన్నాయన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో విఫలమయ్యారన్నారు. రెండవ బడ్జెట్లో యువతకు నిరు ద్యోగ భృతి, మహిళలకు కేటాయింపులు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు గొర్లి సూరిబాబు, మల్ల బుల్లిబాబు మలసాల కిషోర్, పెద్ది శెట్టి గోవింద, జాజుల రమేష్, పీలా శ్యామ్, కే.యం నాయుడు, కలగా గున్నయ్య నాయుడు, ఉగ్గిన రాము, మహిళా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు








