అత్యంత వైభవంగా శ్రీ నూకంబిక అమ్మవారి జాతర మహోత్సవాలు

అనకాపల్లి:ఉత్తరాంధ్ర ఇలవేల్పుగా ప్రసిద్ధిగాంచిన శ్రీ నూకంబిక అమ్మవారి జాతర మహోత్సవాలలో భాగంగా ఏర్పాటుచేసిన పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ ఏడాది రాష్ట్ర పండగ ప్రకటించిన నేపథ్యంలో మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ  ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ గ్రౌండ్లో  జరుగుతున్న సంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా శనివారం  750 మంది మహిళలచే సామూహిక శ్రీ లలిత సహస్రనామ పారాయణం నిర్వహించారు. అనంతరం కోలాటాలు, భరతనాట్యం కార్యక్రమాలు కడురమ్యంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి పరిసర ప్రాంతాల మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.  శ్రీ నూకాంబిక అమ్మవారి కి ఎంతో ప్రాముఖ్యత చేకూర్చే విధంగా ఇటువంటి కార్యక్రమాలు కార్యక్రమాలు నిర్వహిస్తున్న జనసేన పార్టీ ఇంచార్జ్ భీమరశెట్టి రామ్కికి, కూటమి నాయకులకు పలువురు ధన్యవాదాలు తెలియజేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు