అనకాపల్లి: పట్టణపరిధిలో విద్యుత్ లైన్లలో మరమ్మతుల కారణంగా గురువారం ఉదయం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈఈ రాజశేఖర్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు గూడ్స్ రోడ్డు, కోట్నివీధి, వాటర్ ట్యాంక్ ఏరియా, ఆమంచి వారి వీధి, వేల్పుల వీధి, జార్జి క్లబ్ ఏరియా, గొల్ల వీధి తదితర ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలుపుదల జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని గమనించి వినియోగదారులు విద్యుత్ సిబ్బందికి సహకరించాలని కోరారు.

Post Views: 102








