‘ఓజి’ సినిమాలో పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్ పై పెద్ద చర్చ..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఓజి’ (ఓజాస్ గంభీర) చిత్రం థియేటర్లలోకి వచ్చేసింది. నిన్న అర్ధరాత్రి నుంచే షోలు ప్రారంభం కాగా, సినిమాకు అన్ని వైపుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. పవన్ కల్యాణ్ నటన, సుజిత్ దర్శకత్వంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా మొత్తం ‘ఓజి’ ఫీవర్‌తో నిండిపోయింది.

 

సినిమాకు పాజిటివ్ బజ్ రావడంతో, ఈ ప్రాజెక్ట్ కోసం నటీనటులు, దర్శకుడు అందుకున్న పారితోషికం వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సినిమా కోసం పవన్ తన కెరీర్‌లోనే రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

వస్తున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి గాను పవన్ కల్యాణ్‌కు ఏకంగా రూ. 80 కోట్లు పారితోషికంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇది ఆయన కెరీర్‌లోనే అత్యధిక మొత్తం అని అంటున్నారు. ఇక ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన యువ దర్శకుడు సుజిత్‌కు రూ. 8 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందినట్లు సమాచారం.

 

అలాగే, ఈ సినిమాలో కీలక ప్రతినాయకుడి పాత్రలో నటించిన బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మికి రూ. 5 కోట్లు చెల్లించారని, కథానాయికగా నటించిన ప్రియాంక అరుల్ మోహన్‌కు రూ. 2 కోట్లు ముట్టినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ పారితోషికాల వివరాలపై చిత్ర బృందం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటనా రాలేదు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు