హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో రికార్డ్స్ బ్రేక్..! ఎకరా స్థలం రూ.177 కోట్లు..!

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో రికార్డ్స్ బ్రేక్ అయ్యాయి. రాయదుర్గ్ నాలెడ్జ్ సిటీ భూముల వేలానికి ఊహించని స్పందన వచ్చింది. ఎకరానికి ఏకంగా వంద కోట్లకు పైగా పలికింది. ఈ రోజు నిర్వహించిన వేలం పాటలో ఎకరానికి రూ.177 కోట్ల చొప్పున ఎంఎస్ఎన్ రియాల్టీ(MSN Realty) సంస్థ భూములను కొనుగోలు చేసింది. మొత్తం 7.67 ఎకరాల ల్యాండ్ పార్సిల్ ను ఎంఎస్ఎన్ రియాల్టీ సంస్థ వేలంలో దక్కించుకుంది. ప్రారంభ ధరను టీజీఐఐసీ ఎకరాకు రూ.101 కోట్లుగా వేలం వేసింది. చివరకు ఒక ఎకరాకు రూ.177 కోట్ల చొప్పున రాయదుర్గ్ నాలెడ్జ్ భూములను ఎంఎస్ఎన్ రియాల్టీ (MSN Realty) సంస్థ దక్కించుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. దక్షిణ భారత దేశంలోని ఇది అత్యధిక ధరగా చెబుతున్నారు.

 

⦿ సౌత్ ఇండియాలో అత్యధిక ధర..?

 

గతంలో కోకాపేట నియోపోలిస్‌లో ఎకరా ధర రూ.100.75 కోట్లు పలికింది. నియోపోలిస్ వేలం రికార్డును రాయదుర్గ్ నాలెడ్జ్ సిటీ భూముల వేలం బ్రేక్ చేసింది. దక్షిణ భారత దేశంలోనే అత్యధిక ధరకు భూములు కొన్న సంస్థగా MSN రియాల్టీ (MSN Realty) పేరు నిలిచిపోయింది. నాలెడ్జ్‌ సిటీలో కీలక ప్రాంతంలో ఉండడంతో ఈ భూములకు MSN రియాల్టీ (MSN Realty) సంస్థ ఎక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు వెనుకాడలేదు.

 

⦿ క్వాలిటీ అపార్ట్‌మెంట్‌లను నిర్మించడమే లక్ష్యం..

 

ఎంఎస్ఎన్ రియాల్టీ (MSN Realty) అనేది హైదరాబాద్‌లో లగ్జరీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను అభివృద్ధి చేసే సంస్థ. ఇది ప్రముఖ ఫార్మా దిగ్గజం ఎంఎస్ఎన్ గ్రూప్ (MSN Group) నుంచి ఏర్పడింది. 2024లో సంస్థను ప్రారంభించారు. నాణ్యత, డిజైన్, సుస్థిరతపై దృష్టి సారించి హై-ఎండ్ అపార్ట్‌మెంట్‌లను నిర్మించడం లక్ష్యంగా పెట్టుకుంది. వన్ బై ఎంఎస్ఎన్ అనేది నియోపోలిస్, హైదరాబాద్ లోని సంస్థ మొదటి అల్ట్రా లగ్జరీ నివాస ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టులో విశాలమైన, విలాసవంతమై అపార్ట్ మెంట్స్, కమ్యూనిటీ హాస్పిటాలిటీ, మంచి నాణ్యమైన సౌకర్యాలు ఉంటాయి.

 

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ లో వినూత్నమైన, నాణ్యమైన లగ్జరీ స్థలాలను ప్రజలకు అందించడమే ఎంఎస్ఎన్ రియాల్టీ సంస్థ ప్రధాన లక్ష్యం. అర్బన్ రియాలిటీ రంగంలో ఓ కొత్త ప్రమాణాన్ని నెలకొల్పుతోంది. ఈ సంస్థ రాబోయే ఐదేళ్లలో నియోపొలిస్, ఇతర ప్రాంతాల్లో దాదాపు 20 మిలియన్ చదరపు అడుగుల నిర్మాణాలను డెవలప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రారంభంలో హై ఎండ్ అపార్ట్ మెంట్ లపై దృష్టి సారించి తర్వాత హై ఇన్‌కమ్ గ్రూప్, అందుబాటు ధరల గృహ నిర్మాణ రంగలోకి విస్తరించాలనే యోచనలో సంస్థ ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు